#458

సేవ కిదే యుక్త సమయము

రాగం: సౌరాష్ట్ర · తాళం: అట

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
ప్రభు సేవ కిదియే సమయంబు – ప్రజల విమల – ఫలముల నొందనిదియే సమయంబు ॥ ప్రభు ॥
చరణము 1
మరణంబు బడక ముందే – ఘోర – తరమైన పాపాత్మ – లరసి గుణ పడంగ –నరక వేదన బాపు కొరకు – దేవున్ జెరి మరి తెలియ నెంతో– కరుణతో నొసగె నె ॥ ప్రభు ॥
చరణము 2
కరుణ గల్గెడి దివసములలో – నీవు – పరమ భాగ్యంబులు – బడియుంగ వచ్చు –మరణం బెరిగిన జీవాత్మ – యది – మరుచేద విది యెంతో ॥ ప్రభు ॥
చరణము 3
పశ్చాత్తాపం బనెడి తలుపు – మూయ – బడుము దేవుని కరుణా – భాగ్యమను తలుపు – నిశ్చయముగా వేయ బడు –నెంతో – యాశ్చర్యకరమౌ – నవన మగుపడదు ॥ ప్రభు ॥
చరణము 4
సారస్యమైన కార్యంబుల – జేయ – సమయ మనెడి తలుపు – సరగమూయబడును – వారక మృతి బొందునప్పుడే – గాక – సార కార్యము లన్ని – చక్కగా జేయు ॥ ప్రభు ॥
చరణము 5
గత దినంబులకై స్తుతింతును – మిగుల – కఠినంబులైనట్టి – గండములనుండి – ప్రతిదినంబును దప్పించుచు – నెంతో – మితిలేని కృపచేత – బ్రతికించు మమ్ములను ॥ ప్రభు ॥
చరణము 6
నీతియుతులుగు భక్తులారా – మన – పాతకములకు జచ్చి – పరమేశ్వరుని– ప్రీతి మ్రొక్కులు చెల్లించుదము – నూతన – వత్సరము ప్రభు – స్తుతికైబ్రతుకుదుము ॥ ప్రభు ॥