#457

క్రీస్తు కొరకు సేవ

రాగం: ఖరహరప్రియ · తాళం: ఆది · రచయిత: బునమల బెంజమిన్

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
శ్రీ యేసుని వేడు – మనసా – సేవింపవే నేడు – నీ యుపములు బాపియు నిన్ను నెడ – బాయక కడు సహాయము జేసెడి ॥ శ్రీ యేసుని ॥
చరణము 1
పాపంబులు వీడి – పశ్చా – తాపంబును గూడి – దాపున జేరుము –దయగల ప్రభువు నీ – పాపము బాపియు బాలించును ధర ॥ శ్రీ యేసుని ॥
చరణము 2
దేవుని మరువకుము – దైవ – సేవను మరువకుము – జీవపు ద్రోవను – స్థిరముగానడువను – పావన మనసును – బ్రాపుగా నిచ్చెడి ॥ శ్రీ యేసుని ॥
చరణము 3
రక్తము చిందించె – ప్రభువు – రక్తితో నీ కొరకు – రక్తపు టూటల – శక్తిని నమ్మిన – ముక్తికలుగును – భక్తితో నీవు ॥ శ్రీ యేసుని ॥
చరణము 4
సిలువయే నీ ఘనము – క్రీస్తు – సిలువయే నీ ధనము – సిలువయే భాగ్యము – తులువల కెల్లను – సిలువ వలననే – కలుగును రక్షణ ॥ శ్రీ యేసుని ॥