#456
క్రైస్తవ సేవ
పల్లవి · Pallavi
సంతోసంబున వత్తు – సర్వేశ్వరుని చిత్త – మెంతయు నెరవేర్చెదను – వంతలువిడినాదు – నంతరంగము కదుర – నెంతొ విశ్వాసమున – వెంట వచ్చెదను ప్రభువా ॥ సంతో ॥
చరణము 1
సురుచిరముగు మరియ – సూనుని యాజ్ఞలు –శిరమున నిడికొందును – మరియ మనసుతో – మార్తమ్మ కరములతో – బరమసౌఖ్యము బొంద – భక్తితో సేవింతు ॥ సంతో ॥
చరణము 2
నా రాజు సేవ దు – ర్భరమై బాధగా నున్న– భారంబుగాను దోచదు – సారెసారెకు – దనదు – చక్కని చిరునవ్వు – వారించిభారమును – ధీరత నొసగును ॥ సంతో ॥
చరణము 3
కారుణ్యమున నాదు – కల్మషమయ హృదయ– భారములను మోసితి – ఆ రాజ్యమునగల – యాస్తికై నా చిత్త– మాలసింపక నెత్తి – యందే స్థిరముగా నుంచు ॥ సంతో ॥
చరణము 4
ఈ యిల నే జేయు – సేవకు ఫలములు – నీచోట గనుగొందునే – కాయం బీదర – కర్మలం గరపిన – నా యాస్తి నాహృదయ – మా లోకమునమండు ॥ సంతో ॥