#455

యేసు స్వామి నీకు నేను

రాగం: ఇంగ్లీష్ మూలం: All to Jesus I surrender · రచయిత: (అనువాదం: ఎం. జి. రామానుజాచార్యులు)

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు స్వామి నీకు నేను ॥ నా సమస్తము నా సమస్తమునా సమస్తము నిత్తును నా సమస్తము నీ సన్నిధిలో వసించి నా సురక్షకా నీ హితుడనైఆశతో సేవింతును నా సమస్తము ॥
చరణము 1
యేసుస్వామి నీకే నేను దోసి లొగ్గి మ్రొక్కెదన్ తీసివేతు లోకయాశల్యేసు చేర్చుమిప్పుడే ॥
చరణము 2
నేను నీవాడను యేసు నీవును నావాడవు నీవు నేను నేకమాయె నీశుద్ధాత్మ సాక్ష్యము ॥
చరణము 3
నీకు నన్ను యేసు ప్రభు ఈయనేనే యెరిగినీదు ప్రేమశక్తి నింపు నీదు దీవెనియ్యవే ॥
చరణము 4
యేసు నీదె నా సర్వాస్తిహాసు జ్వాలలన్ బొందిహాసు రక్షణానందమాహల్లెలూయా స్తోత్రము ॥