#454

నేను నీవాడనై యుండ గోరెదన్

రాగం: ఇంగ్లీష్ మూలం: I am Thine, O Lord, I have heard Thy voice · రచయిత: ఫ్రాన్సెస్ జేన్ వాన్ అల్ స్టైన్ (అనువాదం: జేకబ్ చేంబర్లేన్)

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
నేను నీవాడనై యుండ గోరెదన్ యేసు ప్రియ రక్షకానీవు చూపు ప్రేమను గాంచితిన్ నన్ను జేర్చు నీదరిన్ ॥
చరణము 1
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా నీవు పడ్డ సిలువకున్ –నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకాగాయపడ్డ ప్రక్కకున్ ॥
చరణము 2
నన్ను బ్రతిష్ఠాపరచుము నాథా నీదు కృపవలననేనాదు నాత్మ నిన్ను నిరీక్షించు నీ చిత్తంబు నాదగున్ ॥
చరణము 3
నీదు సన్నిధిలో నికను నుండ నెంత తుష్టి నాకు కగున్ –స్నేహితుని మాటలాడెదన్ సర్వశక్తి ప్రభుతో ॥
చరణము 4
నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదుపరమందున దాని శ్రేష్ఠత నేను అనుభవించెదన్ ॥