#451
నీ చిత్తమే సిద్ధింప ప్రభువా
పల్లవి · Pallavi
సర్వ చిత్తంబు నీదేనయ్యా – స్వరూపమిచ్చుకుమ్మరివే – సారెపై నున్న మంటినయ్యా – సరియైన పాత్రగా జేయుమయ్యా –సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ॥ సర్వ ॥
చరణము 1
ప్రభూ! సిద్ధింతు నీ చిత్తమే –ప్రార్థించుచుంటి నీ సన్నిధి – పరికింపు నన్ని దివసంబున – పరిశుభ్రమైనహిమముకన్న – పరిశుద్ధుడన్ జేసి పాలింపుమా – పాపంబుబోవ నన్ను గడుగుమా ॥ సర్వ ॥
చరణము 2
నీ చిత్తమే సిద్ధించు ప్రభువా – నిన్నేప్రార్థింతు నా రక్షకా – నీచమౌ గాయముల చేతను – నిత్యంబు కృంగిఅలసియుండ – నిజమైన సర్వశక్తుండవే – నీచేత బట్టి నన్ను రక్షింపుమా ॥ సర్వ ॥
చరణము 3
ఆత్మస్వరూప నీ చిత్తమే – అనిశంబు చెల్లు ఇహపరమున – అధికంబుగా నన్ని యాత్మతో – నావరింపుమా నా రక్షకా – అందరూ నాలో క్రీస్తుని జూడ – ఆత్మతో నన్ను నింపుము దేవా ॥ సర్వ ॥