#448

సమర్పణ ప్రార్థన

రాగం: ముఖారి · తాళం: అట · రచయిత: మాధవభక్తుల దావీదు

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
కొనుము మా హృదయంబు – లను నీకర్పించెద – మనయము నుతియించుచు – ఘనముగా గృపచేత మము గా – చినను మేముమెంతయు నెనరు గల – మనుచు నీ పాదముల కెరగుచు – ననిశమును నీ కృపను –దలంతుము ॥ కొనుము ॥
చరణము 1
బలహీనులము మేము – బలవంతుడవు నీవు – బల మిచ్చి మమునడుపుము – ఇలను మేము యింక బ్రతుకు – దివసంబులను నీ పద భక్తిచే –నెపుడలయ కుండగ మమ్ము గాడు ని – ర్మలిన హృదయుల జేసి కరుణను ॥ కొనుము ॥
చరణము 2
ఘోరారణ్యము భువి వి – చార సంకలితము – భూరి భయంకరము – దారి లేదు యింక నీవు తప్ప –వేరే సాధన మెచ్చట గానము – కోరి మము నందరిని నీదరి – జేర్చుకొనుమార్గమును జూపు ॥ కొనుము ॥
చరణము 3
గత వత్సరమున నీ – యతులుమౌ కృపచేత – పతితుల మము గాచితి – మతి వినమ్రుల మగుచు మా మా – మతులలో నీ ప్రేమ దలచుచు – మతి విహీనత వీడి యింకనిన్ను – సతత తత్త్వము సేవింతుమయ్య ॥ కొనుము ॥
చరణము 4
ఈ వత్సరంబున – నెవ్వరు మాలోన – పోవుదురిలను విడిచి – దేవవారలు భువిని వదలి – పోవు కాలమందున దిమ్మరి – ద్రోవలో వారలను సుఖముగా – బ్రోవదొర్కొని పోవుమయ్యా ॥ కొనుము ॥
చరణము 5
మమును విశ్వాస – మార్గమందున దోడ – నిమ్ముగా గొని పోవుచు – నమ్మి నీ ప్రియ సేవకులబృందం – దేవుమునకు సిద్ధంబులగు మాకు – టములను మేము పొందుటకువే – గమ్ముగా బాత్రుల జేసి ॥ కొనుము ॥
చరణము 6
శోధనల యందున – బాధల యందున – నాదార్పు మా కొసంగుము –శోధనలచే మాకు మరియును – శుద్ధమగు హృదయంబు లిచ్చుచు – శోధనల్ ఫలియింప జేయుము – బాధకములు గాక యుండ ॥ కొనుము ॥
చరణము 7
ఈ లోక దుఃఖము – లెల్ల నేగిన పిదప – నీ లోకమును జేరగా –పాలుమాలక మేము మామా – పరుగు నెత్తెదముసాయమిమ్మో – యేలికా నీ కరములను మ – మ్మెప్పుడుకొని నడువంగ నేర్పు ॥ కొనుము ॥
చరణము 8
దురితంబు లెల్లను – గరుణచే గడిగి నీ – పరమందు మము జేర్చుము – నిరతమును మేమచ్చట నీ కృప – విరివి నెంతయు బొగడుచును మా – కరముల బంగారు వీణెలు – నెరవుగా గొని మీటుచుందుము ॥ కొనుము ॥