#447

సమర్పణ

రాగం: యమునాకల్యాణి · తాళం: అట · రచయిత: డి. వి. డానియేల్

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
సృష్టిపితా – సర్వోన్నతా – సమర్పింతున్ – సర్వస్వమున్ ॥భూమి యాకాశము నీవే – భూధర శిఖరములు నీవే – భూప్రజలునీవారే – బలశౌర్యములు నీవే ॥ సృష్టి ॥
చరణము 1
మా వెండి బంగారములు నీవే – మాకున్న వరములు నీవే – మా దేహములు –మా గేహములు మా జీవితము నీవే ॥ సృష్టి ॥
చరణము 2
వెలలేని గాలి వెలుతురులు – విలువైన పాడి పైరులు – వివిధంబులైనదీవెనలు – నీ కరుణా వర్షములు ॥ సృష్టి ॥
చరణము 3
పరిశుద్ధ గ్రంథపు పలుకులు – పరలోక తేనె చినుకులు – ప్రభు యేసుని మాటలు – మావెలగ బాటలు ॥ సృష్టి ॥
చరణము 4
మాదంత నీదే మహాదేవా – మా రాజువయ్యా యెహోవా – మా తనువులు మాబ్రతుకులు మా యావదాస్తి నీవే ॥ సృష్టి ॥
చరణము 5
మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది? – మోక్ష నాథాయేసుప్రభో - అంగీకరించు విభో ॥ సృష్టి ॥
చరణము 6
తండ్రి కుమార శుద్ధాత్ముడా – త్రియేక దేవ స్తోత్రములు – దాత వీవే నేత వీవే– దేవాది దేవుండవే ॥ సృష్టి ॥