#446

నా సిలువ

రాగం: బిలహరి · తాళం: త్రిపుట · రచయిత: వంతగాని పరదేశి

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు! నా సిలువ నెత్తి – యిప్పుడు నే – నీ సుమార్గమున బట్టి –నా స్వజనము లనాదరంబున – ద్రోసినను బగచేసిన – నా సమస్తము నీవెగా యిక – నే సరకుగొననేమియును ॥ యేసు ॥
చరణము 1
ఎన్ని శ్రమలు వచ్చిన – లోకపుటాశ – లన్ని భిన్నము నొందిన – నన్నుఖిన్నుని జేయ నేరవు – సన్నుతుండును స్వర్గము – నన్నినావైయున్న విగ నిక – నన్ను గదుపున దెవ్వరు ॥ యేసు ॥
చరణము 2
ఆపదలు నన్ను జుట్టిన – జేరుదు నే – నో పరాత్పర రొమ్మున – బ్రావకుండువు పతితుడై నీ – దాపు జేరిన వానికి – దాపమాపుచు సంతోసంబిడి – ధన్యు జేయుదు వీవెగా ॥ యేసు ॥
చరణము 3
నిన్ను బ్రేమించెడు తండ్రిని – నా యాత్మా – నిన్ను రక్షించిన క్రీస్తును –ఘను నిన్ను జొచ్చిన ప్రియాత్మను – ఘన త్రైకునినిత్యమును – గొనుము రక్షణ, పాపము జిం – తను విడిచి యింక నెన్నడును ॥ యేసు ॥
చరణము 4
విశ్వాస కవచంబును – మేను విడి – విజ్ఞాపనము చేయుము – శాశ్వతంబగురాజ్యమునకు – సదయుడౌ ప్రభువు నడుపు – విశ్వసితము లభించునటనీ – విన్నపము స్తుతియును గా ॥ యేసు ॥