#445

నేను నీ సేవకుడను

రాగం: ముఖారి · తాళం: అట · రచయిత: పుлиపాక జగన్నాథము

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
నేను నీ వాడను దేవా – నిక్కంబుగా – నేను నీ వాడను దేవా –వీనుల నీ ప్రేమ – వివర మాలించుచు – మేను నాత్మయు నిత్తు – మేలొసగునీకిప్పుడు ॥ నేను ॥
చరణము 1
ఘనుడవైన నీవు – గలిగించితివి నన్ను – మనుజ లోకమునందు – నిన్ను నేనుసేవింప ॥ నేను ॥
చరణము 2
నాకు నవసరమౌ – నానా వస్తువు లిచ్చి – నీ కటాక్షము నన్ను –నిలుపుచున్నది గాన ॥ నేను ॥
చరణము 3
నా దోషములనుండి – నన్ను రక్షింపను – నీదు పుత్రుని ప్రేమ – నిండార నొసగితివి ॥ నేను ॥
చరణము 4
నేను పాపముల చేత – నిజముగా జావగా – నీ నెరవుచే నన్ను – నీవుబ్రతికించితివి ॥ నేను ॥
చరణము 5
నా తనువు నాత్మయు – నాకు గలిగిన వన్ని – నా తండ్రి యిచ్చితివి – నాకు నీకృపచేత ॥ నేను ॥