#444
జ్యోతిగ నన్ను జేయుము
పల్లవి · Pallavi
జ్యోతిగ నన్ను జేయుమో దేవా –ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ జేయుమో దేవా –జ్యోతిగ నన్ను జేసి మాలో – క్రీస్తు మార్గము బయలుపరచి –నీతి ప్రేమలతోడ హృదయము – నింపి మమ్ము నడిపింపుమయ్యా ॥ జ్యోతిగ ॥
చరణము 1
మా కుటుంబము లోన నీ వెలుగు – ప్రసరించునట్లుగా – నాదు బ్రతుకునుశుద్ధి జేయుమయ్యా – మా కుటుంబములోని వారలు – మానకను నీ వెలుగుచూపగ – మమ్ము నీ మార్గంబునందున – మనుపు పరిశుద్ధాత్మనిడుమయ్యా ॥ జ్యోతిగ ॥
చరణము 2
సంఘమున నీ కీర్తి కనపడగ – పరిశుద్ధ సహవాసంబులో నన్ను వృద్ధిశక్తులన్నిటి – పారదోలగ శక్తినిడి నీ – భక్తి కాంతిని జూపి నాలో ॥ జ్యోతిగ ॥
చరణము 3
నిన్ను దెలియని యాత్మ లెన్నెన్నో – మా చుట్టునున్నవి – నీ కొరకైకనిపెట్టుచున్నవయ్యా – అన్నివేళల నీ సువార్తను – అందరికి ప్రకటింపమనసున – నాశనిడి నీ వార్త వెలుగును – అన్ని దిశలకు చాటునట్లుగా ॥ జ్యోతిగ ॥
చరణము 4
సమయమును వరముల నొసగితివి – మా రక్షకా ధన – సంపదను నీవె యొసగితివి – విమల జీవితమందు వానిని విరివిగా నితరులకొసగి – వీర త్యాగార్పణములతో నీ – వెలుగు ప్రసరింపగ జేయను ॥ జ్యోతిగ ॥