#443
సంపూర్ణ సమర్పణము
పల్లవి · Pallavi
శ్రీ యెహోవా నీ కొసంగెద – శ్రేయమొదవగ నాదు సంపద –పాయక నీ సమ్ముఖమ్మున – నే యెడ నివసింతు భక్తితో ॥ శ్రీ యెహోవా ॥
చరణము 1
అడుగడుగుతో నీ పాదముల బడి – యొడయుడా నావల్ల నీకై –తడవు చేయక కొలుతు నిన్ను – తండ్రి నన్నంగీకరించుమి ॥ శ్రీ యెహోవా ॥
చరణము 2
నీవు నా రాజువు నిరతము – నేను నీ బిడ్డను నిశ్చయము –పావనాత్ముని యెదుట నాదు – జీవముడుదు సజీవ నవముఖర ॥ శ్రీ యెహోవా ॥
చరణము 3
ప్రభువరా యర్పించుకొందు – భక్తితోడ నన్ను నిందు –శుభప్రదము లగు శక్తులతో నన్ను – సొంపుమీరగ నింపు స్వామీ ॥ శ్రీ యెహోవా ॥
చరణము 4
మహిమస్తుతులు చెల్లును నా – మనంబునకు నిత్యంబుగాను –ఇహపరంబున బ్రోచువాడు – నీవే సుమ్మా లోక రక్షకా ॥ శ్రీ యెహోవా ॥