#442

సమర్పణ గీతము

రాగం: యమునాకల్యాణి · తాళం: త్రిపుట · రచయిత: సి. డి. శుభా Direct

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
జీవితాంతము వరకు నీకే – సేవ సలుపుదు నంటిని –నీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా ॥ జీవితాంతము ॥
చరణము 1
ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు గలిగిన –అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా ॥ జీవితాంతము ॥
చరణము 2
అన్ని వేళల నీవు చెంతనే – యున్న యను భవమీయవే –తిన్నగా నీ మార్గమందున – పూని నడిచెద రక్షకా ॥ జీవితాంతము ॥
చరణము 3
నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్ర దృశ్యములున్నను –శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ॥ జీవితాంతము ॥
చరణము 4
నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులను –చెదరగొట్టుము రూపమాపుము – శీఘ్రముగా నా రక్షకా ॥ జీవితాంతము ॥
చరణము 5
మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే –ఇహము దాటెడిదాక నిన్ను – వీడనంటిని రక్షకా ॥ జీవితాంతము ॥
చరణము 6
పాప మార్గము దరికి బోక – పాత యాశల గోరక –ఎప్పుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా ॥ జీవితాంతము ॥