#441

సమర్పణము

రాగం: సౌరాష్ట్ర · తాళం: అట · రచయిత: పులిపాక జగన్నాథము

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
నావన్ని యంగీకరించుమీ – దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ –నావన్ని కృపచేత – నీ వలన నొందిన – భావంబులను నేను – బహు ధైర్యమొందెద ॥ నావన్ని ॥
చరణము 1
నీకు నా ప్రాణము – నిజముగా నర్పించి – నీకు మీదుగ గట్టి – నీ కొరకు నిల్పెద ॥ నావన్ని ॥
చరణము 2
సత్యంబు నీ ప్రేమ – చక్కగా మది బూని – నిత్యంబు గర్వముల – నీ సేవ జేసెద ॥ నావన్ని ॥
చరణము 3
నీ సేవ జరిగెడు – నీ యాలయమునకు – నా సచే నడిపించు – మరల నా పదములు ॥ నావన్ని ॥
చరణము 4
పెదవులతో నేను – బెంపుగా నీ వార్త – గదలక ప్రకటింప – గలిగించు దృఢ భక్తి ॥ నావన్ని ॥
చరణము 5
నా వెండి కనకంబు – నా తండ్రి గైకొనుమీ – యావంతయైనను – నాశింప మదిలోన ॥ నావన్ని ॥
చరణము 6
నీవు నా కొసగిన – నిర్మల బుద్ధిచే – సేవ జేయంగ నిమ్ము – స్థిర భక్తితో నీకు ॥ నావన్ని ॥
చరణము 7
చిత్తము నీ కృపా – యాయత్తంబు గావించి – మతి తప్పకుండగా – మార్గంబు దెలుపుము ॥ నావన్ని ॥
చరణము 8
హృదయంబు నీ కిత్తు – సదనంబు గావించి – పదిలంబుగా దాని – బట్టి కాపాడుము ॥ నావన్ని ॥