#440

స్వసమర్పణము

రాగం: యదుకులకాంభోజి · తాళం: త్రిపుట · రచయిత: మూంగమూరి దేవదాసు

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
తనువు నాదిదిగో గైకొనుమీ ఓ ప్రభువా – నీ పనికి బ్రతిష్టించుమీ –దినములు క్షణములు – తీసికొని యవి నీదు – వినుతిన్ బ్రవహింప జేయు – నను శక్తి నీయుమీ ॥ తనువు ॥
చరణము 1
ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పనిచేయ జేతు వివిగో –యనయంబు నీ విషయమైన సొగసుగా జురుకు – ధనముతో బరుగెత్త – వినయ పాదములివిగో ॥ తనువు ॥
చరణము 2
స్వరంబు నాదిదిగో గైకొనుమీ – వరరాజ నిన్ను గూర్చి – నిరతము పాడునిమ్ము –మరియు పెదవులివిగో – మహనీయమైన నీ – పరిశుద్ధ వార్తతో – భరిపూర్ణముగా నింపు ॥ తనువు ॥
చరణము 3
వెండి బంగార మివిగో – కొంచెమైనను నాకై – యుండవలెనని కోరను –నిండిన నీ యిష్ట – నియమంబు చొప్పున – మెండుగా వాడుకొన – మితియౌ జ్ఞానం బిదిగో ॥ తనువు ॥
చరణము 4
నా యిష్ట మిదిగో యిది – నీ యిష్టముగా జేయ – నా యిష్ట మింక గాదది –నా యిచ్ఛ యున్నట్టి – నా హృదయ మిదిగో – నీ – కే రాజకీయా సింహాసనమౌ ॥ తనువు ॥
చరణము 5
ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధారవోయెదన్ –నన్ను నీ వానిగా – నాథా గైకొనుమప్పుడు – చెన్నుగా నీ వశమై – స్థిరముగా నుండగదే ॥ తనువు ॥