#439
పరిశుద్ధత కొరకు ప్రార్థన
పల్లవి · Pallavi
సంపూర్ణ పరిశుద్ధినిమ్ము – సత్య – సంపూజ్య సర్వజ్ఞ పరిశుద్ధ దేవా ॥ సంపూర్ణ ॥
చరణము 1
నిర్మల మనసు రంజిల్ల – నిత్య – పరమానందంబు నా యాత్మలో నెరపు – ధరణిశ్రమల నోర్పు నిమ్ము – పాప – పరితాప మనుదినం బభివృద్ధి పరచి ॥ సంపూర్ణ ॥
చరణము 2
విశ్వాస సమృద్ధి నిమ్ము – నాదు – ఈశుండ శ్రీ యేసు ప్రేమ నెంచి సం –తోషంబుగా సేవించుటకు – నీదు – నా యాశీస్సు దయచేయు దాస పోషకుడా ॥ సంపూర్ణ ॥
చరణము 3
నాలో కృతజ్ఞత నింపు – నన్ను – పాలించు ప్రభునికై – బ్రతుకంగా నిమ్ము –చాల తనదు మహిమ బొగడి – సర్వ – కాలంబు ధన వాక్కున్ గనిపెట్టునట్లు ॥ సంపూర్ణ ॥
చరణము 4
నా పాపములే యేసునాథున్ – ఘోర – తాప నిర్యాణంబు లందింప జేసెన్ –నా పాపములకు దుఃఖింతున్ – దేవ – కాపాడుమీ నన్ను బాపంబునుండి ॥ సంపూర్ణ ॥
చరణము 5
పెక్కంత శుద్ధిని బొంది – నేను – ఇక్కట్ల నోడింప శక్తి నందిమ్ము – చిక్కులబడి యుండునప్పుడు – నీతి – లోకమంద నాసక్తి మిక్కుట పరచి ॥ సంపూర్ణ ॥
చరణము 6
నీ రాజ్య ప్రవేశమంది – తండ్రి – యా రాజ్య శుశ్రూష నిల నేర్చునట్లు –పరిశుద్ధాత్మ సహాయ మిమ్ము – యేసు – ధరణి నీవలె నేను వర్తించునట్లు ॥ సంపూర్ణ ॥