#438
పవిత్ర హృదయము కొరకు ప్రార్థన
పల్లవి · Pallavi
విమల హృదయమిమ్ము – విదితంబు నిన్ను గొల్వ – యేసు నాథా –నీదు విమల రక్తము చేత – విశదము కావలె నెద నిమ్ము – విశ్వనాథా ॥ విమల ॥
చరణము 1
అణకువ క్షమ శాంత – మధికముగా నాకిమ్ము – ఆత్మనాథా –నీకు ప్రణుతమౌ నా యెద – ప్రభుని పీఠము జేయు – మాత్మనాథా ॥ విమల ॥
చరణము 2
నీ చిత్తమే యెంచు – నీ పాదముల బట్టి – నిలిచియుందు –నిండు నికరమౌ ప్రకటితమౌ – సుకర హృదయ మిమ్ము – యేసునాథా ॥ విమల ॥
చరణము 3
భయభక్తు లలరెడు – భావంబు నా కిమ్ము జీవనాథా –నన్ను లయ జీవములయందు – జయశాలినిగా జేయు – మేసునాథా ॥ విమల ॥
చరణము 4
పరిశుద్ధ హృదయంబు – పరమేశ నా కిమ్ము – ధరణిమీద –నన్ని తరుణముల నాకు – ధరణి మావే యంచు – దలప నాథా ॥ విమల ॥
చరణము 5
నీ రూపము నిమ్ము – నిన్ను బోలి నేనుండ – నిత్యనాథా –నీదు సారూప్య మెదమీద – సంపూర్తిగా వ్రాయు – సత్యనాథా ॥ విమల ॥
చరణము 6
ప్రేమపూరిత హృదయ – మేమరక నా కిమ్ము – ప్రేమనాథా –యెంతో ప్రేమమౌ సుమమౌ – నేమమౌ బ్రతుకిమ్ము – క్షేమనాథా ॥ విమల ॥