#437

పరిశుద్ధత కొరకు ప్రార్థించుట

రాగం: రేగుప్తి · తాళం: అట · రచయిత: యేసుదాసు జీవరత్నము

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
రమ్ము శ్రీ యేసూ – సమ్మతి నాదు – మనమున నిలువ –నిమ్ము నా పెదవుల – నీతి యగ్నిచే నంట – గ్రమ్మర నా నతి – వదలి నీ కృప బొంద ॥ రమ్ము ॥
చరణము 1
నిన్ను స్తుతింతు – నీ కృప నెప్పుడు – నెన్ని కీర్తింతును – బనుగ నీ కృపని –నెన్నన్నడెరుగని నరుల – కన్న యేసన్న నీ – ధన్య రుధిరమె చాలు ॥ రమ్ము ॥
చరణము 2
తరమే యెన్నంగను – దత్కృపను భూ – నభముల నైనను – నిరతము నీ ప్రేమ – నీతి పరిమితిచే –ధరణి దజో వాసులకును – గలిగించు – గడు వింత ॥ రమ్ము ॥
చరణము 3
భవదీయ కృపను – బాగుగ చాటి – భువి నీ చిత్తమును – అధి నెంచక వచ్చి – యమిత బలముతోడ –నవగతి నీతికి – కిరీటంబు నే బొంద ॥ రమ్ము ॥
చరణము 4
నేను నీ కొరకై – నిత్యము బ్రతికి – నిన్ను గణించి – మానుగ 'భళా' యను – మంచి వాక్యము విని –దీన ప్రభుని సమాధానములో నే జేర ॥ రమ్ము ॥