#431
ఆహా! నాకే మానందము
పల్లవి · Pallavi
ఆహా! నాకే మానందము శ్రీ యేసు నా చేయి పట్టి సహాయుడై నా యన్నిటను సజీవుడై నడుపును ॥
చరణము 1
నా దారి చూపును యేసు నా చేయి పట్టి నడుపునుఎన్నడు నెడబాయడు యేసే నా దారి చూపును ॥
చరణము 2
ఏ దేశమున సుఖంబు లైన సదా విచారమైననుబాధాంధకారమైనను ముదముతోడ నుందును ॥
చరణము 3
చింతలే నాకు నీ దయ నెంతయు మావు తోడుగాన్ బంతంబు నీచేపట్టుచు సంతోషముతో నే నుందును ॥
చరణము 4
నా చావు వేళ వచ్చినన్ విచారమొందక ధృతిన్ నీ చేయి పట్టి యేసుడానీ చారు మోక్షమునకు జేరుదును ॥