#432

యేసూ, మమ్ము నడిపించు

రాగం: ఇంగ్లీష్ మూలం: Saviour, like a Shepherd lead us · రచయిత: (అనువాదం: జేకబ్ చేంబర్లేన్)

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు, మమ్ము నడిపించు నీదు కాపు కావలెన్నీవు మమ్మును పోషించు మమ్ము జేర్చు మందలోన యేసునాథా, ప్రియనాథా!మమ్ము విమోచింపవే ॥
చరణము 1
మమ్ము నాదరించు యేసు మాకు పాలకుడవు పాప మార్గమునందు నుండిప్రేమతోడు తప్పించుమా యేసునాథా, ప్రియనాథా!మొర నాలకించుమా ॥
చరణము 2
బీద పాపులైన మమ్ము నీవు అంగీకరింతువుమమ్మును బవిత్రపరిచి మమ్ము విడిపించుమా యేసునాథా,ప్రియనాథా! నిన్ను నాశ్రయింతుము బాల్యమందు నిన్ను జేరి ॥
చరణము 3
నిన్ను హత్తుకొందుము ప్రియ రక్షకుండ, యేసూనీ ప్రేమ జూపుమా యేసునాథా,ప్రియనాథా! మమ్మింక ప్రేమించుమా ॥