#430
యేసూ, జీవమార్గమును చూపింపుము
పల్లవి · Pallavi
జీవమార్గమును యేసూ, చూపింపవే నీవు మాకు ముందు వేగవెంట వత్తుము మేము వేగ తండ్రి యింటికేమమ్ము నడుపవే ॥
చరణము 1
హింస కలిగిన మమ్ము గావుమామమ్ము కష్టకాలమందు నాదరించు భూమియందుమింటి త్రోవలో మమ్ము నడుపవే ॥
చరణము 2
సొంత వేదనన్ చింత కలిగినన్అన్య హింస గూర్చి యేడువమమ్ములను సహింపనిమ్ము మేము సత్యమునుచూడ నేర్పవే ॥
చరణము 3
మా ప్రవర్తన చక్కపరచుమామాకు నెట్టి హింసలైన నీ సహాయమిచ్చి, నేటియాత్రకారిగానే తలుపు తీయవే ॥