#429

నన్ను నడుపుము యెహోవా

రాగం: ఇంగ్లీష్ మూలం: Guide me, O Thou Great Jehovah · రచయిత: విలియం విలియమ్స్ (అనువాదం: హెచ్. హెన్రీ డేవిస్)

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
నడుపుమీ, మహా యెహోవా లోక యాత్రా యందున నీదు శక్తి నాకు దిక్కునన్ రక్షింప జేపట్టు దివ్య మన్నా, దివ్య మన్నానా కాపారమై యుండు ॥ నడుపుమీ ॥
చరణము 1
ఊటగా స్వచ్ఛ జలము బండనుండి పారనీఅగ్ని మేఘ స్తంభాలచే నడవి నన్ను దాటించు గొప్ప ప్రాపూ, గొప్ప ప్రాపూనాకు తోడవు సదా ॥ నడుపుమీ ॥
చరణము 2
యొర్దాను నది దాటు వేళ భీతులెల్ల బాపుముమరణ శ్రమలన్ని నన్ను క్షేమ కానాను జేర్చునుస్తుతి గీతి, స్తుతి గీతి పాడెదను నిత్యము ॥ నడుపుమీ ॥