#427
ప్రతి గంట నాకు నీవు కావాలి
పల్లవి · Pallavi
యేసూ, నా ప్రభువా, నీ ప్రేమ లేకున్ననా యాత్మ కేదియు విశ్రాంతి నీయదు ॥
చరణము 1
ఒక్కొక్క గంట నేను నిన్నాశ్రయించుకొందు నీ యాశీర్వాద మిమ్మునా రక్షకుడా ॥
చరణము 2
యేసూ, రేయింబగళ్లు నా యొద్ద నుండుమునాతో నీవుండిన నే భయముండదు ॥
చరణము 3
సుఖంబు బొందగా నిన్నే యాశింతును దుఃఖంబునొందగా నీవే శరణ్యము ॥
చరణము 4
నీ మార్గమందున నే నడువ నేర్పుమునీ మాట చొప్పున నన్నును దీవించుము ॥
చరణము 5
నిన్నే యాశింతును యేసూ, నా ప్రభువా నీవంటివాడనైనన్నుండ జేయుము ॥