#426
లోయలోపల
పల్లవి · Pallavi
నా రక్షకుని వెంబడింతు నన్నిటను ప్రయాసమైన లోయలైన భయఘోరమైన కొండలైన జంకక నడచెదనుసురక్షితంబుగాను నేను వెళ్లుదును దయ జూపు యేసు నన్ను వెంబడించిపరమ కిరీటమొందువరకు నడిపించుచో ॥ యేసు ॥
చరణము 1
నేను ఎన్నడెన్నడును భయపడనుమేలు భువనంబులో దగన్ఆశతో నన్నిటను వెంబడింతును.నా యేసుతోడ వెళ్లుచుందు నా కర్తతోడ నెందునైన నేగుదెంచెదనునెల్లడను నాకు మెచ్చిన తండ్రి చూచువరకున్ ॥ యేసు ॥
చరణము 2
నా కాలమెల్ల యేసునందు నమ్మి భాసురంబు ప్రభు వెంట కన్నులుందును –మూసికొని యెక్కడైన వెళ్లుదును –భీకరంపు వారిధులైన నేను దాటుదును ॥ యేసు ॥