#424

యేసు మన యాశ్రయము

రాగం: సావేరి · తాళం: కురుఝంపె · రచయిత: మిక్కిలి శామ్యూలు

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
శరణు శరణు యేసు దేవా – నన్నుగరుణింపవే నిత్య జీవా – పరమ దేవుని తనూ – భవుడవైధరణిలో – నర రూపమైతివి – నరులను రక్షింప ॥ శరణు ॥
చరణము 1
దైవోగ్రమునకు పాత్రుడను – విమల – భావమునకు నసహ్యుడను – గావించిన పాపకర్ముడను హీనుడను – జానవలసినట్టి స్వామిద్రోహుడనయ్య ॥ శరణు ॥
చరణము 2
మద మత్సరంబులు మెండై – నాదు – మది నాక్రమించెను నిండై – సదయుండ నీ దివ్య – సర్వజనుల మూరి – విదితముగా బాపములు – వేడుకొన జేసితి ॥ శరణు ॥
చరణము 3
మోసంబులో జిక్కి చాల – నేను – దోసంబు చేసితి నిల – యేసు నాథుని సిలువనే మాత్రమైనట్టి – నా సతితో గూడని – యన్యాయపరుడను ॥ శరణు ॥
చరణము 4
నెమ్మది యింతయు లేక మదిలో – లేక – గ్రమ్ముకొని యాఘనము నా యెదలో –ద్రిమ్మరినై భువిని – తిరిగి వేసారగా సమ్మతము దొరకదో – సర్వేశ్వరుడా నీకంటె ॥ శరణు ॥
చరణము 5
నా తండ్రి యో యేసునాథ – నిన్ను – భూత చేసిన దేను గాదా – నీతిమాలిన పాప –నీచుడను దుష్టుడను – నా తప్పు క్షమియించి నన్నేలి రక్షింపు ॥ శరణు ॥
చరణము 6
కడు దయా శాంత స్వభావా – నన్ను – దడవు చేయక యేలుకోవా – యెడబాసియున్నజనులకై – యోర్చి యా యాసటను – బడి జీవమిచ్చిన నా – ప్రాణ రక్షక కావు ॥ శరణు ॥