#423
యేసు సర్వశక్తుడు
పల్లవి · Pallavi
సర్వశక్తుడా నిర్మలాత్ముడా –సర్వజన సంరక్షకా – మా సర్వపాపము బరిహరింప నీ – సర్వమహిమను విడిచివా ॥ సర్వ ॥
చరణము 1
నిత్య నాశనమగునట్టి మమ్ము – నిత్య శాపము బాపి మరి – నీ నిత్య జీవము మాకు నియ్యను – మృత్యు బాధలు పడితివా ॥ సర్వ ॥
చరణము 2
పాప మరణపు బంధకములను – తెంపి మమ్మువిడిపించుటకు – మా పాపమును భరించి మాకై – యాపదల పాలైతివా ॥ సర్వ ॥
చరణము 3
మెట్టుకు బౌలు దుష్టులనుచే – పట్టి జీవము నిచ్చితివి – కాబట్టి యిక నీ కట్టడలలో – దిట్టముగా బలపరుచుమా ॥ సర్వ ॥
చరణము 4
సత్యవిధుల లో నడువ నేను – శక్తుడను రక్షకా – నీ భృత్యునికి శక్తి నిచ్చి నడి – పింపు నీ ఘన సేవలో ॥ సర్వ ॥
చరణము 5
నీదు నామము మహిమపరచుచు – నాదు జీవితకాలమున – బహుసాధువుగా నన్ను జేసి సాయము – నాథుడా నాకీయుమా ॥ సర్వ ॥
చరణము 6
ప్రస్తుతము పరదేశినై – ప్రచురంబు జేతు నీ స్తోత్రములు – పరమ వస్తుఘన రాజ్యంబు కొరకై – వాస్తవముగా నిరీక్షింతున్ ॥ సర్వ ॥
చరణము 7
ముక్తినుండి నీవు రాగా – శక్తితోడ ప్రభు యేసువా – యా శక్తితో నిన్నుగూడుకొని బహు – యుక్త స్తోత్రములు జేతుము ॥ సర్వ ॥