పల్లవి · Pallavi
యెహోవా నా కాపరి – ఇక నాకు కొదువ ఏమి ॥ యెహోవా ॥
చరణము 1
పచ్చిక చోట్లలో – పండుకొన జేయును నన్ను – స్వచ్ఛ జలముల కడకు – చక్కగా నడిపించు ॥ యెహోవా ॥
చరణము 2
ఆయన దయతో నా – యాయాసముల దీర్చి –న్యాయ మార్గములందు – నన్ను బట్టి నడిపించు ॥ యెహోవా ॥
చరణము 3
గాఢాంధకార మార్గమున – నేను దిరిగినను –గాఢంపు గుహతోడ – కరుణించు నన్నెప్పుడు ॥ యెహోవా ॥
చరణము 4
నీవు తోడైయుండ – నిర్భయంబగు నాకు –కావవచ్చును దుడ్డు – కర్రయును దండంబు ॥ యెహోవా ॥
చరణము 5
నా శత్రువుల నడుమ – నాకు భోజనమొసగి యాశ తీరగా – తలంటె నూనెతో బోసి ॥ యెహోవా ॥
చరణము 6
నా గిన్నె నిండెను – నా బ్రతుకు దినములలోబాగుగా నీదు కృపా – పాద దయలు వెంటాడు ॥ యెహోవా ॥
చరణము 7
పరమానందముతోడ – ప్రభు సన్నిధానమున –పరిశుద్ధాలయమందే నిరతంబు నివసింతు ॥ యెహోవా ॥