#421
యేసు శరణుజొచ్చుట
పల్లవి · Pallavi
శరణు జొచ్చితి యేసునాథుడా –శక్తిహీనత గలిగె నా – ధరణి మిమ్ము నెమ్మి బొందితి – దయచేసి కావవే ॥ శరణు ॥
చరణము 1
కరుణ జూడుము కన్న తండ్రివి – కల్మషం బడబాపవే – మరణమొందక మునుపు నన్నిల – మార్పు నొందగా జేయవే ॥ శరణు ॥
చరణము 2
మొరను జేర్చెద నాలకించుచు – మోము నా దెస జూపవే – యురు పదంబుల సేవ జేసెద – నుద్ధరించుము కూర్మితో ॥ శరణు ॥
చరణము 3
తామస క్రియలందు వాంఛలు – తాకకుండగా జేయవే – క్షేమమైనసువార్త బోధల – సిద్ధపడి విననీయవే ॥ శరణు ॥
చరణము 4
శ్రమలు చాల గలిగి యున్నను – సైప నేర్పుము సత్కృపన్ – గమిలి పోయెడిమాయ లోకపు – కాంతి నీరస మంచును ॥ శరణు ॥