#420

క్రీస్తు కరుణయాశ్రయించుట

రాగం: ముఖారి · తాళం: అట · రచయిత: మిక్కిలి శామ్యూలు

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు కరుణ – ఇదియే మా శరణు – యేసు కరుణ ॥యేసుని కరుణ – ఇదే మాకు శరణని – యాసతో నమ్మిన – యధములకు నెల్ల ॥ యేసు ॥
చరణము 1
ఎన్నిక చేయక – యే పాపినైనను – మన్నించి బ్రోచెడు – మా దేవుడైన ॥ యేసు ॥
చరణము 2
పశ్చాత్తాపము నొందు – పాపుల నెల్లను – నిశ్చయముగా బ్రోవ నిపుణులై యున్న ॥ యేసు ॥
చరణము 3
దిక్కు లేకున్నట్టి – దీన జనాత్మల – చక్కగా బ్రోచెడు – సదయుడై యున్న ॥ యేసు ॥