#419

యేసు నా ఆత్మ ప్రియుడు

రాగం: ఆనందభైరవి · తాళం: అట · రచయిత: మాథ్యూస్ శామ్యూలు

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసూ నా యాత్మ రక్షకుండ – నన్ను – వాసిగా నీ రొమ్మున నుండనీ –చేసియు జలరాసులను నీవు – తీసివేయము – మోసముల ద్రోసి ॥ యేసూ ॥
చరణము 1
జీవ బాధల దాటుదాక – నన్ను – నీవె దాచము నా రక్షక – రూపమునకునడప – ప్రోవుము యేసు – దేవయాత్మను – జీవమును జేర్చు ॥ యేసూ ॥
చరణము 2
ప్రాపు లేని నా యాత్మకు నీవు – నీదు – దాపునకు జేర్చి బ్రోచి కావుము పరమాత్ముడా – యుపేక్షతో నెంచి – యాపదలు బాపి – యాదరించుము ॥ యేసూ ॥
చరణము 3
నా నమ్మకము నీ యందున్నది – నీలో – నేను కోరు సాయంబున్నది – గాన నేప్రాపు – లేని నా తలను – బూని రెక్కల – లోన గప్పుము ॥ యేసూ ॥
చరణము 4
యేసు నీవె నాకు సర్వము – నీదు – దాస జనుల లేవనెత్తువు – నీసుబల మిమ్ము – యేసు రోగులకు – వాసిగా జీకువారలను నడప ॥ యేసూ ॥
చరణము 5
నావంటి ఘోర పాపి యేడి – యేసు – నీవంటి పరిశుద్ధుండేడి – కేవలము సత్య – భావముతో నిండి – నీవు కృపగల – దేవుడవు స్వామి ॥ యేసూ ॥
చరణము 6
నీదు కృపా బాహుళ్యమందు – యేసు నాదు పాపము గప్పుకొందు – సాదరంబగు – నీదు మాటల – మోదమున శుద్ధి – పాదుకొననిమ్ము ॥ యేసూ ॥
చరణము 7
నీవు నిత్య జీవపుటూటవు – నాకు – జీవజలంబు నిచ్చి కావుము – మీపు నా యెదలో గావుగా లేచి – జీవ పదవికి ద్రోవ తీయుమా ॥ యేసూ ॥