పల్లవి · Pallavi
ముక్తి గనరే ముక్తి – గనరే మీ మనంబుల – శక్తిగల రక్షకుని పలుకులు – ముక్తి సాధనములకు మూలము – భక్తి గొని యానంద మొందరే ॥ ముక్తి ॥
చరణము 1
పాపభారము క్రింద శ్రమపడు – పాపులారా రండు నేనే – ప్రాపు నెమ్మది మీకు నిచ్చెదనని – பரమ రక్షకుండానతిచ్చెను ॥ ముక్తి ॥
చరణము 2
ఇచ్చ యించువాడు ఇచ్చటికి – వచ్చి జీవజలంబు రుచిగా – పుచ్చుకొనుగా కనుచు బలికెను – సచ్చరితుడు మనుష్య పుత్రుడు ॥ ముక్తి ॥
చరణము 3
ఆకాశమునందుండి యిటు దిగి – లోకమునకు జీవము నొసగునది –ఈ కడనై యున్నదది నేనే యని – యేసు ప్రభు వాక్యము మధురాన్నము ॥ ముక్తి ॥
చరణము 4
నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవము నావలననే – గాని యెవ్వడును తండ్రి యొద్దిక – రానలవిగాదని వచించెను ॥ ముక్తి ॥
చరణము 5
జీవజలమును ద్రావుటకు మీ – భావన లనెడి పాత్ర ముంచుచు – చేవ గొని పానించుచు నిరత – జీవమును వెలుగొంది బ్రతుకుడి ॥ ముక్తి ॥
చరణము 6
ఎక్కడను ఇటువంటి ప్రభువును – మక్కువను వేసారి వెదకిన – చిక్కబోడటు వచ్చి చూడుడి