#417
యేసు మన ఆశ్రయ రక్షకుడు
పల్లవి · Pallavi
నాకై చీల్చబడిన యుగయుగముల శిల ముక్తి – నా కిమ్ము శ్రీ యేసువాలోక రక్షక నన్ను నీ లోపల దాచి – వీక్షతోడను నుండనిమ్ము సద్గుణ శీలా ॥ నాకై ॥
చరణము 1
చీలబడిన నీదు ప్రక్క విడిచి పారు – జాలు జలము రక్తము – చాల నా పాపపు తీర్పు పాప బలము – చాలు రూపమును మాపి నన్నుబావను జేయు ॥ నాకై ॥
చరణము 2
నీదు న్యాయంబగు ప్రామాణ్య విధులను – నాదు సత్కృతి తృప్తిగా – నాదరింపవు పారమార్థికమైనట్టి – నాదు నాసక్తి భాష్పమును బారిన నాకు ॥ నాకై ॥
చరణము 3
నేను చేసిన పాపముల ద్రుంప నెవరిని – గాన నేరను యేసువా – దీనుడనై వచ్చి నీ మేటి సిలువను –మానక నే హత్తుకొనియెద సచ్చరిత ॥ నాకై ॥
చరణము 4
కట్ట బుట్టము లేక పుట్టమునకై యాశ – బుట్టి నీ యెడ వచ్చితి – నెట్టి సహాయము లేక నీపై మది – బుట్టి నీ సత్కృతిని బొంద నెంచెదనయ్య ॥ నాకై ॥
చరణము 5
పరమ కల్మషుడునైన నేను నీటి బుగ్గకు – బరుగు లెత్తెద నిప్పుడు – పరమ పావన నన్ను గడుగుము లేకున్న – మరణమొందుదును నేను ఘోర పాప విధూర ॥ నాకై ॥