#416
క్రీస్తు విశ్వాసుల కాశ్రయము
పల్లవి · Pallavi
నాథ యేసు నాథ క్రీస్తు – నాథ – నే ననాథసాధు జనుల బ్రోచు – సదయు నీ దయ కాదా ॥ నాథ ॥
చరణము 1
గతి దలపక మూర్ఛిత – గమనుడనై యుండగా – సతతము నన్ను గరుణించిబ్రోచెడు – గతియు నీవు కావా ॥ నాథ ॥
చరణము 2
పాపమందు జనినమైన – పామరుండనై యుండగా – దాపు జేరి వేడెదనా – ప్రాపు నీవు కావా ॥ నాథ ॥
చరణము 3
కుటిల బుద్ధిగలవాడను – క్రూరుడనై యుండగా – కటకట నన్ను గని కరుణించెడు – కరుణ నీది కాదా ॥ నాథ ॥
చరణము 4
ఆది కర్తవు నీవు కావా – యఖిల లోకమునకును – బీదవారినెల్ల బ్రోచు –బిరుదు నీది కాదా ॥ నాథ ॥
చరణము 5
సారమైన సత్యశాస్త్ర – సారమీవు కావా – ఘోరమైన పాపి జనుల – గోరి పిలువలేదా ॥ నాథ ॥
చరణము 6
జీవనాధారమైన – త్రోవ నీవు కావా – దేవ దేవ యెహోవా నా –దిక్కు నీవు కావా ॥ నాథ ॥