#415
దేవుని నాశ్రయించుట
పల్లవి · Pallavi
ఓ దేవా నన్ను బ్రోవ – నీదే భారమయ్య రావే ॥ ఓ దేవా ॥
చరణము 1
స్వామి స్వామి యన నా భారం – ప్రేమ చూపను నీ భారంపామరుడ ననెడు నా భారం – పాపిం బ్రోవను నీ భారం ॥ ఓ దేవా ॥
చరణము 2
నెనరు తండ్రి యన నా భారం – నన్ను గనులు చూడ నీ భారంనిన్నే నమ్మ నాదు భారం – నన్నెప్పుడు కావ నీ భారం ॥ ఓ దేవా ॥
చరణము 3
కరుణ సాగర యన నా భారం – కరుణ చూపను నీ భారంశరణని వేడ నా భారం – సంతరింప నీ భారం ॥ ఓ దేవా ॥
చరణము 4
మనవి చేయు నాది భారం – తనివి దీర్పను నీ భారంనిన్ను మది దలప నా భారం – నన్ను గావ నీ భారం ॥ ఓ దేవా ॥