#414

యేసుని ప్రేమ

రాగం: ముఖారి · తాళం: ఆది · రచయిత: పులిపాక జగన్నాథము

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
నీవే నా ప్రియుడవు – యేసు ప్రభు – నీве నా యొడయుడవునీవే యనాది – దేవ పుత్రుండవు –నీవే లోక మెల్ల – నేర్పుగన్ జేసితివి ||నీవే||
చరణము 1
పరమందు నీకుండు – పరమభాగ్యంబులు –నరకాయత్తుడ నైన – నా కొరకు విడిచితివి ||నీవే||
చరణము 2
నీవే నను బ్రోవ – నెనరు నేతెంచి –నీ నెత్తురు ఒలకబోసితివి – నీ నల్ల సిలువపై ||నీве||
చరణము 3
నేనెవరిని బ్రేమింతు – నీ కంటె లోకమున –నే నెప్పుడు మరువను – నీ ప్రేమ నాకర్త ||నీве||
చరణము 4
నీ సేవ నే గోరి – నిన్నే ప్రస్తుతింతు –నీ సేవకుడ నైన – నే నెట్లు నిను విడుతు ||నీве||
చరణము 5
సకలంబు నేలెడి – చక్కని రాజువు –సకలాధికారంబు – చక్కగ జేయుదువు ||నీве||
చరణము 6
నీ సేవకుల నెల్ల – నేర్పుగా నేలెదవు –నీ సేవకులు పొంద – నిత్య సహాయంబు ||నీве||