#413
యేసు తోడైయుండిన జాలును
పల్లవి · Pallavi
నీవు తోడై యుండినజాలు – యేసు – నిత్యము నాకుది మేలునీవు ధరణి నిండు – నీచపాపుల నెల్ల గావన్బ్రేమ వచ్చి – ఘన ప్రాణ మిచ్చినట్టి ||నీవు||
చరణము 1
నిన్ను బోలు రక్షకుం డేడి – క్రీస్తు – నను బోలు పాతకుం డేడినిను నమ్ము వారలకు – నీ వొసగుచుందువు –తనర పాపక్షమ – దయచేత నిలలోన ||నీవు||
చరణము 2
నీ పాటి బలవంతుం డేడి – ప్రభు – నాపాటి దుర్బలుం డేడికాపాడుచుందువు – కలకాలమును నీవు –నీ పాడ సేవకుల – నేర్పరంజిల్ల ||నీవు||
చరణము 3
నీవంటి ఉపకారి యేడి – కర్త – నావంటి కడు దీనుం డేడిజీవులకును గల్గు – జీవంబు లిచ్చుచు –జీవాధారము లొసగి – జీవులన్ బ్రోచెడి ||నీవు||
చరణము 4
నీవంటి धनవంతుం డేడి – యేసు – నా వంటి ధనహీనుం డేడిప్రోవులై యున్నవి – ఈవులు నీయందు –నీవు వాని నొసగి నిరతంబు నను గావు ||నీవు||