#412

దైవ సహాయము

రాగం: మధ్యమావతి · తాళం: ఏక · రచయిత: మల్లెల దావీదు

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
కొండల తట్టు నేను – కోర్కెతోడ నాదుకన్ను లెత్తెద నిప్పుడు – దండియౌ సహాయ మెచ్చటి నుండినాకు వచ్చునో – అండయౌ ప్రభునిచే స – హాయంబు కలుగును ||కొండల||
చరణము 1
ఆయన భూమ్యాకాశము – లన్నిటిను సృజించె గదా –ఆయన యిక దొట్రిల్ల – నీయడు నీ పాదమున్ ||కొండల||
చరణము 2
నిన్ను గాపాడువా – డెన్నడును కునుకడు –పన్నుగ నిశ్రాయేలు గా – పాడువాడు కునుకడు ||కొండల||
చరణము 3
నీకు యెహోవాయే – నిజముగా గాపగు –నీ కుడిప్రక్కను ప్రభుండు – నీకు నీడగా నగున్ ||కొండల||
చరణము 4
ధాత్రి పగలెండు దెబ్బ – రాత్రి వెన్నెల దెబ్బయైన –మాత్రమైనను నిన్ను – మార్కొనంగ జాలవు ||కొండల||
చరణము 5
ఏ అపాయమును రా – నీయకుండ నా యెహోవ –పాయక నిను గాచును నీ – ప్రాణమున్ గాపాడును ||కొండల||
చరణము 6
మోదంబుతో నిది – మొదలుకొని నిత్యమునన్ –నీదు రాక పోకలందు – నిను యెహోవా కాచును ||కొండల||
చరణము 7
జనక కుమారాత్మకును – ఘనత మహిమ కలుగును –మును నిప్పుడు నెల్లప్పుడు యుగ – ముల కగును గాకామేన్ ||కొండల||