పల్లవి · Pallavi
ప్రీతిగల మన యేసుండెంతో గొప్ప మిత్రుడు మితిలేని దయచేతహత్తుకు ప్రేమించునుక్రీస్తునొద్ద మన భారమంత నప్పగించినన్శక్తిగల యేసుచేతమోత లెల్ల వీడును.నీతిగల మన యేసుధృతిగల మిత్రుడుమృతి బొంది కృపతో విశ్రాంతి కలిగించెను భీతి నొందు పాపులైన చింతాక్రాంతులైననుక్రీస్తు యొక్క దీప్తి చేతక్రొత్త గతి నీతురు.దయగల మన యేసుప్రియమైన మిత్రుడుమాయా లోకమందు నిజాశ్రయుడై కాపాడునుభయ దుఃఖ శ్రమ లాదిమోయరాని బాధలన్జయ మొప్ప నేర్పి యేసుస్థాయి వృద్ధిచేయును.దారుణిలో యేసు గాకవేరుగొప్ప మిత్రుడా? పరలోకమందు యేసే వీరుడై రక్షకుడునారకులా! కావ వేగన్క్రూర హింస బొందెనుకరుణించి యిచ్చి ప్రతి ప్రార్థన నాలించును.