#406
క్రీస్తుని వెంబడించుట
పల్లవి · Pallavi
మనసు నిచ్చి వినుమా – మది ననుసరించి చనుమా || మనసు ||
చరణము 1
అరయ యేసు సిలువ – యది – అమరపురికి త్రోవ ఆ రమ్యమైన త్రోవ – యది యనుసరించినావ – అది యరసి చూచినావా? || మనసు ||
చరణము 2
అది నడచి నడచి పోను – పానందమిచ్చి చనును అది యేసు సిలువ మ్రాను – అది యనుసరింపదగును – అది యందరు చనదగును || మనసు ||
చరణము 3
రక్తమయపు బాట – నీ – ముక్తికదియె యూట భక్తులందరి యెదుట స – ద్భక్తి మెరయు పాట –లనురక్తి బాడెదరచట || మనసు ||
చరణము 4
ఎంత పాపమైన – మదికెంత భారమైన ఎంత దయయోగాని – యది ఎంత కృపయోగాని – యతి శాంతి నిచ్చులోన || మనసు ||
చరణము 5
సాటిలేని దారి – మన – స్వామిచూపుదారి మేటి కల్వరిదారి – జనకోటి దురు గుణహరి – మనకోటకు రహదారి || మనసు ||
చరణము 6
వలదు లోకమీల – నీ – వలపు నా కింకేల నిలువుమింక చాలు – నని పిలుచు యేసు మ్రోల – నే గొలుతు కాలమెల్ల || మనసు ||