#405
దేవుడే మన యాశ్రయము
పల్లవి · Pallavi
దేవుడే నా కాశ్రయంబు – దివ్యమైన దుర్గము – మహ వినోదు డాపదల స – హాయుడై నన్ బ్రోచును – అభయ – మభయ – మభయ మెప్పు – డానంద – మానంద – మానంద మౌనుగ || దేవుడే ||
చరణము 1
పర్వతములు కదలిన హీ – యుతి మార్పుపడినను సర్వమున్ ఘోషించుచు హీ – సంద్ర ముప్పొంగినన్ – అభయ – మభయ – మభయ || దేవుడే ||
చరణము 2
దేవుడెపుడు తోడుగానగ – దేశము వర్ధిల్లును ఆ – తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు – అభయ – మభయ – మభయ || దేవుడే ||
చరణము 3
రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండై యెహోవా వైరిన్ – బూని సంహరించును – అభయ – మభయ – మభయ || దేవుడే ||
చరణము 4
విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన చెల్లచెదరు చేసి రిపుల – నెల్లంద్రుంచు నాయనే అభయ – మభయ – మభయ || దేవుడే ||
చరణము 5
పిశాచి పూర్ణబలము నాతో – బెనుగులాడ జడియును నశించి శత్రుగణము దేవు – నాజ్ఞ వలన మడియును – అభయ – మభయ – మభయ || దేవుడే ||
చరణము 6
కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగ ఏటి కింక వెరవవలయు – నెప్పుడు నాకున్ బండ్రుగ – యభయ – మభయ – మభయ || దేవుడే ||