చరణము 1
నృపా! విమోచకా! ప్రభావేలాది నోళ్ల నీకృపా జయ ప్రభావములునుతింతు నెంతయునన్.
చరణము 2
కృపాధికార! దేవా! నీసాయంబు చేయుమాభవత్ప్రభావ కీర్తనలన్చాటంగ నెల్లడలన్.
చరణము 3
భయంబు చింత బాపునుహర్షంబు పాపికిసౌఖ్యంబు జీవశాంతులునీ నామ మిచ్చును.
చరణము 4
విముక్తి చేయు మిద్దానిపాపంబు బాపునుపాపాత్ము శుద్ధు జేయునుశ్రీ యేసు రక్తము.
చరణము 5
జనాలీ! పాపులల్లరు!శ్రీ యేసుని నమ్మండికృపావిముక్తులందుండిసంపూర్ణ భక్తితో.
చరణము 6
అర్పించె యేసు ప్రాణమున్నరాలి గావనుయజ్ఞంపు దేవు గొర్రెపైనఘంబు వేయండి.
చరణము 7
సత్కీర్తి స్తోత్ర ప్రేమలనుభాన భూమినిసర్వత్ర దేవుడొందుగాసద్భక్త పాలించే.