చరణము 1
కృపగల దేవుని సర్వదా నుతించండిదివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును.
చరణము 2
సర్వశక్తుడాయన సర్వదా చాటించండిదివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును.
చరణము 3
పగటి నేలునట్లు సూర్యుని సృజించెనుదివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును.
చరణము 4
సర్వజీవకోటిని బ్రోచు దేవుడెన్నడుదివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును.
చరణము 5
కర్త మనయందును కనికర ముంచెనుదివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును.
చరణము 6
దైవ ఘన మహిమను జాటుచుండండిఇల కృపగల ప్రేమలు ఎల్లకాలముండును.