చరణము 1
ఓ ప్రార్థనా సుప్రార్థనా నీ ప్రాభవంబునన్ మరతునా?నా ప్రభువునన్ ముఖా ముఖిన్ నే ప్రణుతింతు నీ ప్రభన్నా ప్రాణమా సుప్రార్థనా నీ ప్రేరణంబుచే గదానీ ప్రేమధారన్ గ్రోలుదు నా ప్రార్థనా సుప్రార్థనా.
చరణము 2
పిశాచి నన్ను యుక్తితో వశంబు చేయ నెంచుచోనీ శాంతమైన దీప్తియే నా శంక లెల్ల మానుపున్నీ శక్తి నేను మరతునా నా శైలమన ప్రార్థనానా శోక మెల్ల దీర్చెడు విశేషమైన ప్రార్థనా.
చరణము 3
నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖభార మెల్లనునా దేవుడేసు చెంతకు మోదంబు గొంచు బోవునుసదా శుభంబు లొందెడు విధంబు జూప నీవెగానా ధైర్యమిచ్చు ప్రార్థనా సుధా సుధార ప్రార్థనా.
చరణము 4
అరణ్యమైన భూమిలో నా రమ్యమౌ పిస్సానగరంబు రంగుగాను నెక్కి నా చిర గృహంబు జూతునుశరీరమున్ విదిల్చి నే బరంబు బోవు వేళలోకరంబు నిన్ను మెచ్చెదన్ పరేశు ధ్యాన ప్రార్థనా.