#383
ఆదర్శ ప్రార్థన
పల్లవి · Pallavi
ప్రార్థన వినెడి పావనుడా – ప్రార్థన మాకు నేర్పుమయ్యా || ప్రార్థన ||
చరణము 1
శ్రేష్ఠమైన భావము గూర్చి – శిష్యబృందముకు నేర్పితివిపరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక ప్రార్థన నేర్పుమయ్యా || ప్రార్థన ||
చరణము 2
పరమ దేవుడవని తెలిసి – కరములు ఎత్తి జంటగా మోడ్చిశిరమును వంచి – సరిగా వేడిన – సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా || ప్రార్థన ||
చరణము 3
దినదినము చేసిన సేవ – దైవచిత్తముకు సరిపోవదీనుడవయ్యు – దిటముగ కొండను – చేసిన ప్రార్థన నేర్పుమయ్యా || ప్రార్థన ||
చరణము 4
శత్రుమూక నిను చుట్టుకొని – సిలువపై నిను జంపగనుశాంతముతో నీ – శత్రుల బ్రోవగ – సలిపిన ప్రార్థన నేర్పుమయ్యా || ప్రార్థన ||