#382

ప్రార్థన

రాగం: జంఝూటి · తాళం: ఏక · రచయిత: జోనథా బర్డర్

Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము · Open in the hymnal app

పల్లవి · Pallavi
విన్నపము యేసు నాధుడా నా – మనవి నిప్పుడు ఘనమైన నీదునెనరుచే నన్ను – గావు మెప్పుడు || విన్నపము ||
చరణము 1
ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ – యొక్క పేరటన్ జేరుదురక్కడ నే నక్కడ ఉంటానుఅంటివి || విన్నపము ||
చరణము 2
మరియెవరు దిక్కు ధరణిలోన – వేరు లేరుగా దుర్జనుల కెల్లన్దెలిపి నావు నీవేగా || విన్నపము ||
చరణము 3
మరణ మైతివి హాహా నా – కొరకు సిలువపై నీ – కరుణ కలిగె నెంతయీ దురాత్ముని నాపై || విన్నపము ||
చరణము 4
సకలంబు నీదటంచు మదిని – సంతసించెద వేరొకని కించుకంతయైననుర్వి లేదుగా || విన్నపము ||
చరణము 5
కోరితి నిను దారిగా నన్ను – దూరపరచకు నీ – కూరిమి నా కొసగినడుపు – మరణావధికి || విన్నపము ||
చరణము 6
వినయంబు సద్గుణంబు చిత్త – మునను గూర్పవే ఘనమైన నీతి యనుభవంబు – గలుగజేయవే || విన్నపము ||
చరణము 7
దేవదేవ రావే నిన్ను – సేవ చేయుదు నన్ను – భావనునిగా జేయవేనే పాప నరుడను || విన్నపము ||