#381
'నీవు నన్ను ఆశీర్వదించనియెడల నిన్ను వెళ్ళనియ్యను'
పల్లవి · Pallavi
నిన్ను నేను విడువను దేవ – నీవు నను దీవించు వరకునిన్ను నమ్మినవారల నెల్ల – నీవు చక్కగ దీవించెదవు || నిన్ను ||
చరణము 1
నేను శత్రువునై యుండంగా – నీవు నాపై నెనరు జూపిదాన మిచ్చితివి నా కొరకు – దారుణుడు నీ ప్రియ పుత్రుని || నిన్ను ||
చరణము 2
త్రోవ దప్పి తిరుగుచుండ – దుడుకునైన నన్ను గానిప్రోవంగోరి మదిని నీవు – త్రోవను బెట్టితివి నన్ను || నిన్ను ||
చరణము 3
నాటినుండి నేటివరకు – నాకు గలిగిన శోధనములలోనేటుగా నన్ను గాచిన వాడవవు – నీవు గావా, ఓ నా తండ్రి || నిన్ను ||
చరణము 4
ఇంతకాలము నన్ను గాచి – యింకను నన్ను విడువవనుచుసంతసించి మదిని నేను – చక్కగ నీ దరి జేరితిని || నిన్ను ||
చరణము 5
నీవు గాక యెవరున్నారు – నేలపై నన్ను గాపాడచేవలేని నాకు నీవు – చేవగలుగుగ జేయ గలవు || నిన్ను ||
చరణము 6
అడుగువారి కిచ్చెద నంచు – నాథుడిచ్చినావు గాననడిగెద నిన్ను సహాయంబు – నాత్మమై యున్నట్టి తండ్రి || నిన్ను ||
చరణము 7
నాదు ప్రార్థనలన్నియు నీవు – నీదు కృపచే నాలకించినీదు సరణిని నిల్పి నన్ను – నేర్పు దనరగ రక్షించితివి || నిన్ను ||