#380

సహాయము కొరకు ప్రార్థన

రాగం: రేగుప్తి (చేయ: ఖండించవలెను) · తాళం: త్రిపుట · రచయిత: పులిపాక జగన్నాధము

Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము · Open in the hymnal app

పల్లవి · Pallavi
నా యేసు నాధా – నన్ను జూడవే – నా జీవనాధనా యేసు నాధమా – నవ పాప మోచక – నీ యనుగ్రహముచే – నిరతంబు భువిలోన || నా యేసు ||
చరణము 1
వింటిని నేను – నా హృదయంబు – వింత నొందగను – మింటనుండి నీవు –మేదిని కరుదెంచి – యెంటి నర్పించితి – వొనరంగ నా కొరకు || నా యేసు ||
చరణము 2
నీ యాజ్ఞలను – నిజముగా మీరి – నే నుంటి మునుపు – నా యెదను గుందుచు – నా పాపముల కొరకు – నీ యొద్దన్ జేరెద – నిజరక్షకుడ వనుచు || నా యేసు ||
చరణము 3
నేను నీ నెనరు – రుచి జూచితి – నిది యెంతో తనరు – దీనుడనగు నేను –దృఢ కృతజ్ఞత ప్రేమల్ – గానుపింపగ నీ – కడకు వత్తును దేవ || నా యేసు ||
చరణము 4
నేను అశక్తుడను – నిను సేవింప – నిత్యంబు ధరను – గాన ప్రార్థన బూని – ఘనుడవని నమ్ముచు – నాందంబున వత్తు – ననిశంబు నీ దరికి || నా యేసు ||
చరణము 5
దయచేయుమయ్యా – సత్యాత్మను – దాసునికిప్పుడు – దయచేసి శుద్ధాత్మ – ద్వారాగా గల్గించుము – ప్రియముగ నీ సేవ పెంపుచేయగ శక్తి || నా యేసు ||
చరణము 6
నీవు నాతోడ – నెప్పుడుండు – నిజ మొనగూడ – నీవు నాతో నుండ – నిర్భయముగా నేను – త్రోవన్ బోవుదు నీకు స్తోత్రంబు చేయుచు || నా యేసు ||