#379

భక్తుని ఆసక్తి

రాగం: కాంభోజి (చేయ: చేడియలు గుంపుగూడి) · తాళం: అట · రచయిత: రావూరి లక్ష్మయ్య

Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు పరలోక నాయక – సువిశేష సుఫల ప్రదాయకదోషరహిత ప్రకాశ స్వయం విధి విలాస పరమ నివాస బుధ దేవ || యేసు ||
చరణము 1
మంచి మనస్సాక్ష్య మియ్యవే – శ్రమల – నెంచి – కృపల నందియ్యవేవంచనల – నెడ – లించి మొర చిత్త – గించి మిగుల ర – క్షించుమింక వేగ || యేసు ||
చరణము 2
నిరాసుడనని పోనాడక – యొద్దన్ – జేరి నిర్దయ జూడకసారస తత్కృప లూర నన్ను బ్రోచు – వార లెవ్వ రు – న్నారు నీవు గాక || యేసు ||
చరణము 3
కన్నతండ్రి నీ పాదముల్ – పొడ – గన్న వారి హృద్భేదముల్అన్ని దొలగునని – యన్న శుభరవం – బెన్ని విన్నాడ – నన్నవగు క్రీస్తు || యేసు ||
చరణము 4
శంకలను వెడలంగొట్టవే – లోకా – టంకముల నెత్తి మొట్టవేయింక నా యఘ – పంకమును గృప – నింక గను నిష్క – లంకునిగ జేయు || యేసు ||
చరణము 5
దిక్కు నీవని నమ్మితి – నిన్నే – మ్రొక్కు పంతంబు జేసితిచక్కగా నల పి – శాచి దుర్మోహ – దృక్కణించి నీ – చక్కని జేర్చుమో || యేసు ||