#378
ఆదర్శ ప్రార్థనలు
పల్లవి · Pallavi
శాప భయమును నేడుచు – దావీదు – తన – పాప రూపము ఎంచుచుతాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని – ప్రాపు గోరగానే క్షమాపణ నొందిన || కరుణా ||
చరణము 1
కాయమున వెత నోర్చుచు – యోధుడు పౌలు – సాయమీ ధర గోరుచురోయుచు ధనముల్ – నియ్యమని ప్రార్థించి – వేరు రెట్లుగ కృపయు – పాయముగ నొందిన || కరుణా ||
చరణము 2
దినమంత పని చేయుచు – నాధుడు యేసు – జనుల బాధల మోయుచుఇనుడు మరుగౌ వేళ – జనకుని కడకేగి – మనసార విశ్రాంతి – యనుభవించిన స్థలము || కరుణా ||
చరణము 3
ఇల బ్రతుకంతయు ప్రార్థన – ప్రభు యేసునకు – సిలువ తన్ తుది ప్రార్థనచెలువగ విజ్ఞాపనలు జేయుచును మనపై – గల కాలమును దీవెనలు వర్తించెడి చోటు || కరుణా ||