#377
క్రీస్తునందలి అభయము
పల్లవి · Pallavi
నన్ను గన్నయ్య రావే నా యేసు – నన్ను గన్నయ్య రావే ప్రభువా || నన్ను ||
చరణము 1
ముందు నీ పాదారవిందము – లందు నిశ్చల భక్తి ప్రేమనుపొంది హాయిగా జేయ రావే నా – డెంద మానంద మనంతమై యుప్పొంగ || నన్ను ||
చరణము 2
హద్దులేనట్టి దురాశల – నవివేకినై కూడి యాడితిమొద్దులతో నింక కూటమి – వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి || నన్ను ||
చరణము 3
కాలము పెక్కు గతించెను – గర్వాదులెడ దెగవాయెనుఈ లోక మాయ సుఖేచ్ఛలు – చాలును చాలును చాలునో తండ్రి || నన్ను ||
చరణము 4
దారుణ సంసార వారధి – దరి జూపి బ్రోవ నీ కన్ననుకారణ గురువు ఇంకెవరు – లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి || నన్ను ||
చరణము 5
నా వంటి దుష్కర్మజీవిని – కేవలమగు నీదు పేర్మినిదీవించి రక్షింప నిప్పుడే – రావయ్య రావయ్య రావయ్య తండ్రి || నన్ను ||